'కేంద్రం వైఫల్యం వల్లే గ్యాస్ కొరత'
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:49 PM
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్.. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్‌కు ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల పేరు చెప్పి అమెరికా ఒక దేశం తర్వాత మరో దేశంపై దాడి చేస్తూ వస్తోందని, ప్రజల కోసమంటూ విధ్వంసం సృష్టిస్తోందని యోగేంద్ర యాదవ్ మండిపడ్డారు.
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం తాలూకూ తీవ్ర ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సామాన్యులు సైతం గ్యాస్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో.. యుద్ధ పర్యవసానాల ముప్పును ఎదుర్కోవడానికి భారత్ ఎలా స్పందించాలి? ఏయే చర్యలు తీసుకోవాలి? మన నాయకత్వం ఎలా వ్యవహరించాలి? అనే అంశాలపై పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్‌కు ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్ - యోగేంద్ర యాదవ్ ఇంటర్వూ తెలుగు వెర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
విధ్వంసం తప్ప మరొకటి కాదు..
ప్రజల పేరు చెప్పి అమెరికా ఒక దేశం తర్వాత మరో దేశంపై దాడి చేస్తూ వస్తోందని, ప్రజల కోసమంటూ విధ్వంసం సృష్టిస్తోందని యోగేంద్ర యాదవ్ మండిపడ్డారు. ప్రపంచంలోని శక్తిమంతమైన వ్యక్తులను తమవైపు తిప్పుకుని, తాను చేసేది సరైనదేనని నమ్మించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అమెరికాది తప్పుడు అంచనా అయినా, సరైన అంచనా అయినా ఇది విధ్వంసం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. అమెరికా దాడితో ఇరాన్‌లో ముస్లింలు కష్టాలు పడుతున్నారని, ఇరాన్ ఎదురు దాడితో పశ్చిమాసియాలోని దేశాల్లో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనంతటికీ అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మోదీ బలహీనత వల్లే..
యుద్ధం కారణంగా మనదేశం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దాచేందుకు ప్రయత్నిస్తోందని యోగేంద్ర యాదవ్ విమర్శించారు. అంతా బాగానే ఉన్నట్టుగా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ప్రధాని మోదీ బలహీనత వల్లే దేశంలో వంటగ్యాస్, ఎరువుల కొరత ఏర్పడిందని మండిపడ్డారు. ఒక సార్వభౌమ దేశాధినేతను యుద్ధం పేరుతో అమెరికా హత్యచేసినా కనీసం ఖండించలేని స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారని విమర్శించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్ - యోగేంద్ర యాదవ్ ఇంటర్వూ తమిళ వెర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి
వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియదు.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం
మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి