Share News

ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ.. ఈ గ్యాస్‌ల మధ్య తేడాలేంటో తెలుసా?

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:10 PM

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచం తీవ్రమైన గ్యాస్ సమస్య ఎదుర్కొంటోంది. అనేక దేశాలలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా భారతీయులు పెట్రోల్, గ్యాస్ సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారు.

ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ.. ఈ గ్యాస్‌ల మధ్య తేడాలేంటో తెలుసా?
difference between LPG CNG PNG

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచం తీవ్రమైన గ్యాస్ సమస్య ఎదుర్కొంటోంది. అనేక దేశాలలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా భారతీయులు పెట్రోల్, గ్యాస్ సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సంక్షోభం కారణంగా ప్రస్తుతం ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ పదాలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడింటి మధ్య తేడాలేంటో చూద్దాం (LPG vs CNG vs PNG)..


ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ.. మూడూ హైడ్రోకార్బన్ వాయువులే. అయితే వాటి కూర్పు, నిల్వ, సరఫరా, వినియోగంలో చాలా తేడా ఉంది. ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) అనేది ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఇవి ముడి చమురు శుద్ధి చేసినపుడు విడుదలయ్యే సహజ వాయువులు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ను సిలిండర్లలో ద్రవ రూపంలో నిల్వ చేస్తారు. వినియోగ సమయంలో ఇది వాయువుగా బయటకు వస్తుంది. దీనిని ప్రధానంగా వంట గ్యాస్‌గా ఉపయోగిస్తారు (LPG storage).


సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) అనేది మీథేన్. ఇది కూడా సహజ వాయువు. దీనిని చాలా అధిక పీడనం వద్ద కుదిస్తారు. దీనిని సిలిండర్‌లో అధిక పీడనం వద్ద గ్యాస్ రూపంలో నిల్వ చేస్తారు. ఇది ఎప్పటికీ ద్రవంగా మారదు. దీనిని వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది కాలుష్యాన్ని తగ్గిస్తుంది. పెట్రోల్, డీజిల్ కంటే చౌకైనది (CNG gas uses).


పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కూడా అధిక మీథేన్ కంటెంట్ కలిగి ఉంటుంది (PNG gas supply). ఇది గాలి కంటే తేలికైనది. దీనిని తక్కువ పీడనం వద్ద పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తారు. దీనిని పైపులైన్ల ద్వారా ఇళ్లకు లేదా పరిశ్రమలకు నేరుగా గ్యాస్ రూపంలో సరఫరా చేస్తారు. దీనిని వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తారు.


ఇవి కూడా చదవండి..

ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..


మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 16 , 2026 | 06:10 PM