Share News

భార్యను చంపి బట్టలో చుట్టేసి.. మూడు రోజుల తర్వాత..

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:32 PM

ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తున్న కార్మికులకు ఒక్కసారిగా మహిళ మ‌ృతదేహం కనబడడంతో షాక్ అయ్యారు. బెంగళూరులోని సంపిగెహళ్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ మహిళను భర్తే చంపి పాతిపెట్టాడు. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

భార్యను చంపి బట్టలో చుట్టేసి.. మూడు రోజుల తర్వాత..

ఇంటర్‌నెట్ డెస్క్: ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తున్న కార్మికులు.. ఒక్కసారిగా మహిళ మృతదేహం కనబడడంతో షాక్ అయ్యారు. బెంగళూరులోని సంపిగెహళ్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బిహార్‌కు చెందిన సాగర్‌చంద్ర రావత్ (32), అనసూయ బెహరా (28) దంపతులు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది నెలల క్రితమే బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలసవచ్చారు. సంపిగెహళ్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. సాగర్ ఓ హోటల్‌లో పనిచేస్తుండగా.. అనసూయ ఒక బట్టల దుకాణంలో పనిచేసేది. అయితే, ఆర్థిక విషయాలకు సంబంధించి దంపతులు గొడవపడేవారు. ఈనెల 2న కూడా ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో అనసూయను సాగర్ తీవ్రంగా కొట్టాడు. తర్వాత ఆమెను గొంతు నులిమి చంపేశాడు.


మూడు రోజుల పాటు మృతదేహం వద్దే..

అనసూయను చంపిన తర్వాత సాగర్ మూడు రోజుల పాటు మృతదేహం వద్దే గడిపాడు. తర్వాత బాడీని బట్టలో చుట్టేసి బెడ్‌పై పెట్టాడు. అనంతరం సంపిగెహళ్లి ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేశాడు. ఎవరైనా బాడీని కనుగొన్నారో లేదో తెలుసుకునేందుకు కొన్ని రోజుల పాటు పరిశీలించాడు. ఈ క్రమంలో ఖాళీ స్థలాలను శుభ్రం చేసేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పాలికె కార్మికులు సంపిగెహళ్లిలో ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తుండగా మహిళ శవాన్ని కనుగొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, అప్పటికే బాడీ డీకంపోజ్ అవడంతో పాటూ కొంత భాగాన్ని కుక్కలు కూడా తినేశాయి.


మృతదేహాన్ని గుర్తించారిలా..

మృతదేహం కుళ్లిపోయి 20 రోజులకుపైనే కావడంతో ఎవరిదో గుర్తించేందుకు పోలీసులకు మొదట కష్టంగా మారింది. బాడీపై ఒక ట్యాగ్ ఉండడంతో దాని సాయంతో మహిళను గుర్తించారు. ట్యాగ్‌పై ఉన్న వివరాలతో పోలీసులు ఒక మాల్‌కు వెళ్లి ఎంక్వయిరీ చేశారు. దీంతో హత్యకు గురైంది అనసూయ అని గుర్తించారు. తర్వాత ఆమె భర్త సాగర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తన భార్యను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. అలాగే, నిందితుడు పనిచేస్తున్న హోటల్‌లోనూ దర్యాప్తు చేయగా.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తేలింది. నిందితుడు సాగర్‌ను అరెస్టు చేశామని, అతడిని రిమాండ్‌కు తరలించామని సంపిగెహళ్లి పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం షాపుల్లో సీసీ టీవీ కెమెరాలు.. ట్రాకింగ్ విధానంతో పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర

టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

Read Latest National News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 07:41 PM