Share News

మద్యం షాపుల్లో సీసీ టీవీ కెమెరాలు.. ట్రాకింగ్ విధానంతో పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:14 PM

మద్యం సిండికేట్లు లేకుండా చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మద్యం షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని తెలిపారు.

మద్యం షాపుల్లో సీసీ టీవీ కెమెరాలు.. ట్రాకింగ్ విధానంతో పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర
AP Minister Kollu Ravindra

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: మద్యం సిండికేట్లు లేకుండా చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మద్యం షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని తెలిపారు. శనివారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్మిట్ రూమ్స్‌‌కు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అన్‌ఆథరైజ్డ్ షాపులను అనుమతించమని పేర్కొన్నారు.


మద్యం షాపులన్నీ ట్రాకింగ్ మెథడ్‌లో పంపిణీ చేస్తామని అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గతంలో ఆరోపణలు చేశారని.. ఈ నేపథ్యంలో సురక్ష యాప్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గతంలో పాలసీ మొత్తం అవినీతిమయమని అన్నారు. టాప్ బ్రాండ్స్ మాత్రం అనుమతి ఇస్తున్నామని చెప్పారు. ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.


3,562 మద్యం షాపులకు టెండర్స్ పిలిచామని చెప్పారు. 2,929 మద్యం షాపులు రెన్యువల్ చేసుకున్నారని అన్నారు. 804 షాపులు నోటిఫై చేస్తున్నామని వివరించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అప్లికేషన్స్ స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 5వ తేదీన డ్రా తీస్తామని పేర్కొన్నారు. 2014 - 19లో టీడీపీ ప్రభుత్వం మద్యం విధానంలో మంచి పాలసీ చేశామని గుర్తు చేశారు. అయితే 2019 -24 మధ్య ఏమీ జరిగిందో అందరూ చూశారని అన్నారు. పాత షాపుల గడువు ముగియడటంతో మళ్లీ మద్యం నూతన విధానం తీసుకొచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.


అలా అయితే ఆటోమేటిక్‌గా రద్దు: ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

ఒక షాపునకు నాలుగు కంటే తక్కువ అప్లికేషన్లు వస్తే ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఎక్సైజ్ కొత్త పాలసీని కేబినెట్ ప్రతిపాదించిందని గుర్తు చేశారు. కొన్ని షాపులు రెన్యువల్ చేశామని.. కానీ మిగిలిన వాటికి టెండర్స్ పిలిచామని చెప్పారు. మద్యం షాపు కోసం దరఖాస్తు చేసుకునే అప్లికేషన్ ఫీజు రూ.3 లక్షలు పెట్టామన్నారు. అక్టోబర్ 5వ తేదీన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీస్తామని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్న గొడ్డలి పార్టీ: మంత్రి డోలా

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 05:49 PM