Share News

దీపావళి పార్టీలో అలాంటి పాట ఏంది?.. హర్యాన్వీ పాటపై నెటిజన్ల అభ్యంతరం

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:06 PM

దీపావళి వేడుకల్లో భాగంగా ఓ ఆఫీసులో నిర్వహించిన పార్టీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అన్షీ మాలిక్ చేసిన డ్యాన్స్‌పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆమె ఎంచుకున్న పాట, వేసిన స్టెప్పులే ఇందుకు కారణం.

దీపావళి పార్టీలో అలాంటి పాట ఏంది?.. హర్యాన్వీ పాటపై నెటిజన్ల అభ్యంతరం

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి వేడుకల్లో భాగంగా ఓ ఆఫీసులో నిర్వహించిన పార్టీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అన్షీ మాలిక్ చేసిన డ్యాన్స్‌పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆమె ఎంచుకున్న పాట, వేసిన స్టెప్పులే ఇందుకు కారణం. తెలుపు చీర, ఎరుపు బ్లౌజులో కనిపించిన ఆమె.. ప్రముఖ హర్యాన్వి పాట ‘తేరీ ఆఖ్యా కా యో కాజల్‌’కు ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్‌ చేసింది. ఆమె నృత్యం చేస్తుండగా.. కొలీగ్స్ తమ ఫోన్లలో వీడియోలు తీస్తూ, చప్పట్లు కొడుతూ ఆమెను ప్రోత్సహించారు. ‘ఈ దీపావళికి మనం పటాకులుగా మారితే’ అంటూ అన్షీ తన వీడియోకు ఒక క్యాప్షన్ జోడించింది.


కాగా.. అన్షీ మాలిక్‌ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె డ్యాన్స్‌ను తప్పుపట్టారు. ఆఫీసులో నిర్వహించే దీపావళి వేడుకల్లో అలాంటి డ్యాన్స్ చేయడం కరెక్టు కాదన్నారు. దీపావళిని అలా జరుపుకోరాదని ఒక నెటిజన్‌ విమర్శించారు. మరొక నెటిజన్ అలాంటి డ్యాన్స్‌ను అసహ్యకరమైన ప్రదర్శనగా అభివర్ణించారు. అవకాశం దొరికినప్పుడల్లా అలాంటి చీప్ డ్యాన్స్‌లు చేస్తున్నారంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం అన్షీ మాలిక్‌కు మద్దతుగా నిలిచారు. అసలు ఆ వీడియోలో అభ్యంతరకరమైన విషయం ఏముందని ప్రశ్నించారు.


సూపర్ హిట్ సప్నా చౌధరి ఆల్బమ్

‘తేరీ ఆఖ్యా కా యో కాజల్‌’ ఆల్బమ్.. హర్యాన్వి డ్యాన్సర్‌ సప్నా చౌధరికి విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. డీసీ మదానా పాడిన ఆ పాటకు వీర్‌ ధయియా సాహిత్యం అందించారు. సూట్‌ తేరా పత్లా వాల్యూమ్‌ 2 ఆల్బమ్‌లో భాగంగా దీనిని విడుదల చేశారు. పెళ్లిళ్లు, పార్టీలు, ఇతర వేడుకల్లో ఈ ఆల్బమ్‌ను బాగా ప్లే చేస్తున్నారు. విదేశాల్లోనూ ఈ పాటకు భారీగా ఆదరణ లభించింది. గతంలో ఆమ్‌స్టర్‌డామ్‌లో కింగ్స్‌ డే వేడుకల్లోనూ పలువురు ఆ పాటకు నృత్యం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్


ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 05:35 PM