Share News

చున్నీతో ప్రాణం కాపాడారు.. వరద ఉద్ధృతిలో చిక్కుకున్న బైకర్‌ను రక్షించిన కుటుంబం..

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:39 PM

హిమాచల్‌ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. చంబా జిల్లాలో భారీ వరద ఓ బైకర్ ప్రవాహంలో చిక్కుకుపోయాడు.

చున్నీతో ప్రాణం కాపాడారు.. వరద ఉద్ధృతిలో చిక్కుకున్న బైకర్‌ను రక్షించిన కుటుంబం..
Himachal Pradesh flash flood

ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్‌ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. చంబా జిల్లాలో భారీ వరద ఓ బైకర్ ప్రవాహంలో చిక్కుకుపోయాడు. అటుగా కారులో వెళ్తున్న ఓ కుటుంబం సాహసించి అతడిని రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Himachal Pradesh flash flood).


చంబా జిల్లాలోని భర్మౌర్-భటియాత్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారిపై ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో అది చిన్న వాగులా మారిపోయింది. అదే సమయంలో ఓ బైకర్ ఆ మార్గంలో వెళ్తూ వరద ప్రవాహంలో చిక్కుకున్నాడు. నీటి వేగం అంతకంతకూ పెరగడంతో అతడు ప్రవాహం నుంచి బయటపడడం కష్టంగా మారింది (Chamba flash flood).


అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న ఓ కుటుంబం వరదలో చిక్కుకున్న బైకర్‌ను గమనించింది. వెంటనే కారును ఆపి అతడిని రక్షించేందుకు ఆ కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉండటంతో నేరుగా అతడి వద్దకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ మార్గంలో అతడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు (Dupatta saves biker).


ఆ కుటుంబానికి చెందిన ఓ యువతి తన చున్నీని తీసి బైకర్ వైపు విసిరింది. వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్ ఆ చున్నీని పట్టుకున్నాడు. దానిని ఆధారంగా చేసుకుని బయటకు వచ్చాడు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి అతడిని లాగారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్

పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల

Updated Date - Sep 01 , 2026 | 03:49 PM