అసెంబ్లీలో విజయ్ సైగ.. స్టాలిన్‌ను ఉద్దేశించే చేశారంటూ డీఎంకే ఫైర్..
ABN , Publish Date - Sep 08 , 2026 | 09:39 PM
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీలో చేసిన ఓ సైగ రాజకీయ దుమారం రేపింది. 1975-77 ఎమర్జెన్సీ, మీసా కింద జరిగిన అరెస్టుల గురించి మాట్లాడుతున్న సమయంలో విజయ్ తన దవడ వైపు చూపిస్తూ సైగ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీలో చేసిన ఓ సైగ రాజకీయ దుమారం రేపింది. 1975-77 ఎమర్జెన్సీ, మీసా కింద జరిగిన అరెస్టుల గురించి మాట్లాడుతున్న సమయంలో విజయ్ తన దవడ వైపు చూపిస్తూ సైగ చేశారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించే విజయ్ ఆ సైగ చేశారని ప్రతిపక్షం ఆరోపించింది. దీనిపై డీఎంకేతో పాటు విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తున్న సీపీఎం కూడా తీవ్రంగా స్పందించింది (Vijay jaw gesture MK Stalin).
తమ ప్రభుత్వ గ్రాంట్లపై అసెంబ్లీలో జరిగిన చర్చకు విజయ్ సమాధానం ఇస్తూ.. ప్రతిపక్షం తరచూ తాము 'మీసా' చూశామంటూ మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆయన తన దవడ దగ్గర చేతితో ఓ సైగ చేశారు. విజయ్ ఎక్కడా స్టాలిన్ పేరును ప్రస్తావించలేదు. అయితే ఈ సైగను డీఎంకే సహా పలువురు స్టాలిన్ దవడకు సంబంధించిన సూచనగా భావించారు. ఎమర్జెన్సీ సమయంలో స్టాలిన్‌ను మీసా చట్టం కింద అరెస్ట్ చేశారు. పోలీసు కస్టడీలో ఆయనపై దాడి జరిగిందని, ఆ ఘటనలో ఆయన దవడకు గాయం అయిందని డీఎంకే వర్గాలు చాలాకాలంగా చెబుతున్నాయి (Vijay DMK controversy).
ఈ చారిత్రక ఘటనను దృష్టిలో పెట్టుకునే విజయ్ దవడ సైగ చేశారని ప్రతిపక్షం ఆరోపించింది (Vijay Assembly speech). దీంతో అసెంబ్లీ చర్చ రాజకీయ వివాదంగా మారింది. విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తున్న సీపీఎం కూడా ఈ సైగను తప్పుబట్టింది. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా విజయ్‌పై మండిపడ్డారు. కాగా విజయ్ చేసిన సైగను బాడీ-షేమింగ్‌గా చూడటాన్ని టీవీకే అధికార ప్రతినిధి సత్యకుమార్ ఖండించారు. అది కేవలం ఒక సైగ మాత్రమేనని, ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..
హిందీ జాతీయ భాష.. శివ రాజ్‌కుమార్ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో దుమారం..