మొజ్తాబా ఖమేనీకి లండన్‌లో రూ.400 కోట్ల ఆస్తులా.. ఇరాన్ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Sep 08 , 2026 | 08:34 PM
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి లండన్‌లో విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు ఉన్నట్టు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. మోజ్తాబా ఖమేనీ ఆస్తుల గురించి బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ ఓ కథనం ప్రచురించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి లండన్‌లో విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు ఉన్నట్టు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. మోజ్తాబా ఖమేనీ ఆస్తుల గురించి బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ ఓ కథనం ప్రచురించింది. ఖమేనీకి లండన్‌లో రూ.400 కోట్ల విలువైన రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయనేది ఆ కథనం సారాంశం. ఇరాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది (Mojtaba Khamenei London flats).
మొజ్తాబా ఖమేనీకి స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ ఎలాంటి ఆస్తులూ లేవని ఇరాన్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్రాంతంలో పాలెస్ గ్రీన్ వద్ద ఉన్న రెండు విలాసవంతమైన పెంట్‌హౌస్‌లు మోజ్తాబా ఖమేనీకి చెందినవని, ఈ ఆస్తుల విలువ సుమారు 36 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ.400 కోట్లు)కు పైగా ఉంటుందని 'ది సండే టైమ్స్' పేర్కొంది. వాటిని 2014, 2016లో అలీ అన్సారీ అనే ఇరానియన్ బ్యాంకర్ కొనుగోలు చేసినట్లు వెల్లడించింది (Mojtaba Khamenei wealth).
ఈ కథనాలపై లండన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది (Mojtaba Khamenei property). ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. మొజ్తాబా ఖమేనీకి తన తండ్రి అలీ ఖమేనీ మాదిరిగానే ఇరాన్‌లోనూ, విదేశాల్లోనూ కూడా ఎలాంటి ఆస్తులూ లేవని స్పష్టం చేసింది. ఆయన నిరాడంబరమైన జీవనశైలి గురించి ఇరాన్ ప్రజలకు బాగా తెలుసని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..
హిందీ జాతీయ భాష.. శివ రాజ్‌కుమార్ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో దుమారం..