Share News

మోదీ ముంబై కార్యక్రమ వేదిక వద్ద కలకలం.. ఫేక్‌ ఐడీ, తుపాకీతో ఉన్న ఇద్దరు అదుపులోకి..

ABN , Publish Date - Sep 08 , 2026 | 07:05 PM

ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు కలకలం రేగింది. మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమ వేదిక వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మోదీ ముంబై కార్యక్రమ వేదిక వద్ద కలకలం.. ఫేక్‌ ఐడీ, తుపాకీతో ఉన్న ఇద్దరు అదుపులోకి..
PM Modi Mumbai event

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు కలకలం రేగింది. మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమ వేదిక వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరి వద్ద ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఫేక్‌ ఐడీ కార్డు ఉన్నట్లు గుర్తించారు. అతడితో వచ్చిన వ్యక్తి వద్ద తుపాకీ ఉంది (PM Modi Mumbai event).


ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో మంగళవారం ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వేదిక వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ రోహన్ పరేఖ్ (24) వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ప్రధాని కార్యాలయానికి చెందిన అధికారినని చెప్పాడు. అతడి గుర్తింపు కార్డును పరిశీలించగా అది నకిలీదిగా తేలింది (Fake PMO ID).


ఆ వ్యక్తితో పాటు అక్కడ మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు తనకు బాడీగార్డ్‌ అని రోహన్ చెప్పాడు (NMACC security scare). రోహన్ తో పాటు ఉన్న వ్యక్తి వద్ద తుపాకీ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి మొబైల్ ఫోన్లు, గుర్తింపు పత్రాలు, ఇతర వస్తువులను పరిశీలిస్తున్నారు. తుపాకీతో వారు వేదిక వద్దకు ఎందుకు వచ్చారు? ఫేక్‌ ఐడీని ఎందుకు ఉపయోగించారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..


హిందీ జాతీయ భాష.. శివ రాజ్‌కుమార్‌ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో దుమారం..

Updated Date - Sep 08 , 2026 | 07:10 PM