హిందీ జాతీయ భాష.. శివ రాజ్‌కుమార్ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో దుమారం..
ABN , Publish Date - Sep 08 , 2026 | 02:36 PM
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ హిందీ గురించిన చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తన తాజా చిత్రం 'ఒరిజినల్ మాన్‌స్టర్' కార్యక్రమంలో హిందీని జాతీయ భాషగా పేర్కొనడం వివాదానికి కారణమైంది.
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ హిందీ గురించిన చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తన తాజా చిత్రం 'ఒరిజినల్ మాన్‌స్టర్' కార్యక్రమంలో హిందీని జాతీయ భాషగా పేర్కొనడం వివాదానికి కారణమైంది. పలువురు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం శివ రాజ్‌కుమార్ ఉద్దేశాన్ని సమర్థిస్తున్నారు (Shiva Rajkumar Hindi remark).
ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న'ఒరిజినల్ మాన్‌స్టర్' చిత్రం కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా శివ రాజ్‌కుమార్ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో హిందీ డైలాగులు చెప్పడం గురించి ఆయనను ప్రశ్నించగా.. హిందీ తనకు రెండో భాష అని చెప్పారు. తాను హిందీ మాట్లాడగలనని, అది సులభమైన భాష అని పేర్కొన్నారు. ప్రేక్షకులను కలిపేందుకు ఉపయోగపడే 'జాతీయ భాష'గా హిందీని అభివర్ణించారు (Hindi national language comment).
హిందీ గురించి శివరాజ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాయి (Shiva Rajkumar Hindi controversy). శివ రాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందీని 'జాతీయ భాష'గా పేర్కొనడాన్ని ప్రశ్నించారు. ఆయన తండ్రి, దిగ్గజ నటుడు రాజ్‌కుమార్ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరించేవారు కాదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కొందరు మాత్రం శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్