ట్రైన్ డ్రైవర్ క్యాబిన్‌లోకి వెళ్లేందుకు యువతి యత్నం.. ఘటనపై ఆర్పీఎఫ్ విచారణ
ABN , Publish Date - Nov 19 , 2026 | 08:37 PM
రైల్వే స్టేషన్‌లోని మోటార్‌మ్యాన్ క్యాబిన్ (డ్రైవర్ క్యాబిన్) లోకి ప్రవేశించేందుకు ఓ యువతి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై చర్చ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే స్టేషన్‌లోని మోటార్‌మ్యాన్ క్యాబిన్ (డ్రైవర్ క్యాబిన్) లోకి ప్రవేశించేందుకు ఓ యువతి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై చర్చ మొదలైంది. స్కర్ట్, హైహీల్స్ ధరించిన ఆ యువతి.. క్యాబిన్ తలుపు హ్యాండిల్‌ను రెండు చేతులతో పట్టుకుని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. అంతేకాకుండా వెనక్కి వంగుతూ కదులుతూ కనిపించింది. ఎవరో వ్యక్తి ఆ యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన ముంబైలోని గోరేగావ్ రైల్వే స్టేషన్‌లో జరిగిందని, ఆ సమయంలో యువతి మద్యం మత్తులో ఉందని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. అయితే.. ఆమె గుర్తింపు, ఘటన జరిగిన ప్రాంతం వంటి వివరాలు తెలియరాలేదు. ప్రయాణికుల సమయాన్ని వృథా చేసినందుకు ఆ యువతికి జరిమానా విధించాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఈనెల 16న ఇన్‌స్టాగ్రామ్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కు ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు గోరేగావ్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు రైల్వే సిబ్బందిని విచారించారు. ప్లాట్‌ఫాంలు 1, 2కు సంబంధించి ఉత్తర, దక్షిణ వైపుల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించినా.. వీడియోలో కనిపించిన తరహా ఘటన ఏదీ నమోదు కాలేదని ఆర్పీఎఫ్ తెలిపింది. దీంతో ఆ వీడియోలోని ఘటన గోరేగావ్ స్టేషన్‌లోనే జరిగిందన్న విషయాన్ని నిర్ధారించలేకపోయామని ఆర్పీఎఫ్ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన