యూపీలో దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసిన వదిన
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:20 PM
చిన్న వివాదం కారణంగా ఓ మహిళ తన మరిది ప్రైవేట్ పార్ట్స్ (జననాంగాలు)ను కొరికేసింది. దీంతో మరిదికి తీవ్రంగా గాయమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటనొకటి చోటుచేసుకుంది. చిన్న వివాదం కారణంగా ఓ మహిళ తన మరిది ప్రైవేట్ పార్ట్స్ (జననాంగాలు)ను కొరికేసింది. దీంతో మరిదికి తీవ్రంగా గాయమైంది. వెంటనే సమీప ఆసుపత్రికి అతణ్ని తరలించగా వైద్యులు 56 కుట్లు వేశారు. గత శుక్రవారం యూపీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నగర్ జిల్లాలోని సజేతి గ్రామంలో ఆ మహిళ కుటుంబం నివసిస్తోంది. మొన్న (శుక్రవారం) తన పిల్లలను ఆమె కొట్టడం మొదలు పెట్టింది. అలా పిల్లలను కొట్టవద్దని మరిది వారించాడు. వదినను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వీరి మధ్య మాటామాటా పెరిగింది. అంతే ఒక్కసారిగా ఆవేశానికి గురైన ఆ మహిళ మరిదిపై దాడికి దిగింది. అతడి ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసింది. ఈ దాడిలో మరిదికి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా... ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
కర్ణాటకలో కన్నడిగులకే ప్రాధాన్యం.. ఐటీ సంస్థలకు డీకే శివకుమార్ హెచ్చరిక
వసుధైక కుటుంబం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం: జైశంకర్