Share News

వసుధైక కుటుంబం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం: జైశంకర్

ABN , Publish Date - Oct 25 , 2026 | 03:13 PM

ప్రపంచమంతా ఒకే కుటుంబమనే వసుధైక కుటుంబం సిద్ధాంతాన్ని భారత్ మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపిస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.

వసుధైక కుటుంబం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం: జైశంకర్
Jaishankar Vasudhaiva Kutumbakam

ఢిల్లీ, అక్టోబర్ 25: ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని భారత్ మంటపంలో నిర్వహించిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళనంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రసంగించారు. ప్రపంచ దేశాలకు టీకాల పంపిణీ, అభివృద్ధి భాగస్వామ్యాలు, మానవతా సాయం ద్వారా భారత్ తన 'వసుధైక కుటుంబం' (ప్రపంచమంతా ఒకే కుటుంబం) సిద్ధాంతాన్ని కేవలం ప్రచారం చేయడమే కాకుండా ఆచరణలో చూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

కోవిడ్ సమయంలో సాయం: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న సమయంలోనే, ఇతర వెనుకబడిన దేశాలకు కూడా టీకాలను అందించి భారత్ పెద్దమనసు చాటుకుందని గుర్తుచేశారు.

అభివృద్ధి భాగస్వామ్యం: భారత్ నేడు 78 దేశాలలో వందలాది అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహిస్తోందని, శిక్షణ, సామర్థ్య నిర్మాణ సంస్థలలో ప్రపంచానికి చోటు కల్పిస్తోందని తెలిపారు.

తక్షణ స్పందన: నేపాల్, శ్రీలంక, వెనిజులా లేదా జమైకా వంటి దేశాల్లో విపత్తులు ఎదురైనప్పుడు భారత్ మొదటిగా స్పందించి ఆదుకుందని తెలిపారు.

ప్రపంచ యుద్ధ వాతావరణం - దౌత్యమే మార్గం: ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రాంతాల్లో జరుగుతున్న రెండు ప్రధాన యుద్ధాల ప్రభావం నేరుగా సంబంధం లేని ప్రపంచ దేశాలు, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 'మనం మూగప్రేక్షకులుగా మిగిలిపోలేము.. చర్చలు, దౌత్య మార్గాలే ఏకైక పరిష్కారమని భారత్ స్పష్టం చేస్తోంది' అని ఆయన అన్నారు.

ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఆవశ్యకత: ఐక్యరాజ్యసమితి బలహీనతలను, పరిమితులను గుర్తించి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని జైశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో పెద్ద భాగమైన దేశాలను పక్కనబెట్టలేరని, ఐక్యరాజ్యసమితి సంక్షోభాల వేళ నాయకత్వాన్ని వహించాలి తప్ప ప్రేక్షక పాత్ర వహించకూడదని వ్యాఖ్యానించారు. (Jaishankar Vasudhaiva Kutumbakam)


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 03:26 PM