Share News

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి.. ముంబైలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే భారీ నిరసన..

ABN , Publish Date - Oct 04 , 2026 | 04:20 PM

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబైలో ఆదివారం ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి.. ముంబైలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే భారీ నిరసన..
Virat Garjana Morcha

ఇంటర్నెట్ డెస్క్: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబైలో ఆదివారం ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనకు 'విరాట్ గర్జన మోర్చా' అని పేరు పెట్టారు (Virat Garjana Morcha).


మెట్రో సినిమా ప్రాంతం నుంచి ప్రారంభమైన ర్యాలీ దక్షిణ ముంబైలోని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రధాన కార్యాలయం వరకు సాగింది. కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) నేతలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న సర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం ఉండాలంటే ఓటర్ల జాబితా సవరణ, ఓటింగ్ విధానం విషయంలో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు (SIR Maharashtra).


ప్రజల ఓటు హక్కును దూరం చేసేందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ ప్రయత్నిస్తున్నారని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు (Mumbai Protest). మహారాష్ట్రలో ఏకంగా 2.06 కోట్లకు పైగా ఓటర్లకు ఓటు హక్కును దూరం చేశారని విమర్శించారు. కాగా, మహారాష్ట్రలో గతంలో సుమారు 9.78 కోట్ల మంది ఓటర్లు ఉండగా, సర్ ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 7.71 కోట్ల పేర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఉద్యమిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..


బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

Updated Date - Oct 04 , 2026 | 05:09 PM