జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:52 PM
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో (Kishtwar District) ఆదివారంనాడు ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో (Kishtwar District) ఆదివారంనాడు ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాల విశ్వసనీయ సమాచారంతో ఆపరేషన్ ట్రాపి-ఐ (Operation Trashi-I) కింద చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాదులు హతమైనట్టు 'వైట్ నైట్ కార్ప్స్' ఒక ప్రకటనలో తెలిపింది.
కిష్త్వార్ జిల్లా ఛాత్రూ ఏరియాలోని పసెర్‌కూట్ ప్రాంతంలో ఉదయం 10.30 గంటలకు ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఆర్మీ, పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పాక్ టెర్రరిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందింది. కొండపాదాల వద్ద నిర్మించిన మట్టి ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం రావడంతో బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు వైట్ నైట్ కార్స్ప్ ధ్రువీకరించింది. ఘటనా స్థలి నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఛాత్రూ అటవీ ప్రాంతంలో గత నెలలో ఆరుసార్లు ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు, ఒక ఉగ్రవాది మృతిచెందారు.
ఇవి కూడా చదవండి..
నమో భారత్ ట్రైన్, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోదీ
ఏఐ సమ్మిట్ ఓ కీలక మలుపు! మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ