Share News

వేర్వేరు ప్రమాదాలు.. మంటల్లో చిక్కుకున్న ట్రక్కు, బస్సు..

ABN , Publish Date - Feb 18 , 2026 | 08:18 AM

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

వేర్వేరు ప్రమాదాలు.. మంటల్లో చిక్కుకున్న ట్రక్కు, బస్సు..
Uttar Pradesh Accident

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్రం కౌశాంబిలోని జాతీయ రహదారిపై ఒక ఆయిల్ ట్యాంకర్(Oil tanker) భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఆయిల్ రవాణా చేస్తున్న ట్యాంకర్.. విద్యుత్ స్తంభాన్ని(Electricity pole) ఢీకొట్టింది. దీంతో వాహనం బోల్తాపడి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరో ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. ముంబై(Mumbai)లోని కండివాలి తూర్పులో వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సైధామ్ మందిర్ సమీపంలో ప్రమాదం జరిగింది. కండివాలి స్టేషన్(Kandivali Station) నుంచి అనితా నగర్‌కు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులను బస్సు నుంచి సురక్షితంగా కిందకు దింపారు. సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళం, సమతా నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఎంసీ (Brihanmumbai Municipal Corporation) విపత్తు నిర్వహణ సెల్ నివేదిక తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ

Updated Date - Feb 18 , 2026 | 10:14 AM