Share News

కౌంటింగ్‌కు కేంద్ర సిబ్బంది‌.. ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో టీఎంసీ పిటిషన్

ABN , Publish Date - May 01 , 2026 | 08:43 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్‌ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించింది.

కౌంటింగ్‌కు కేంద్ర సిబ్బంది‌.. ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో టీఎంసీ పిటిషన్
Mamata Banerjee

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్‌ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) సుప్రీంకోర్టును (Suprik శుక్రవారంనాడు ఆశ్రయించింది. ఓట్ల కౌటింగ్ సమయంలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా కేంద్ర ప్రభుత్వం, పీఎస్‌యూ (Public sector Undertakings) ఉద్యోగులను మాత్రమే నియమిస్తున్నట్టు ఈసీ శుక్రవారంనాడు తేల్చిచెప్పింది. అయితే ఈ నిర్ణయాన్ని టీఎంసీ తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మినహాయిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల వారి నిష్పాక్షికత, సమర్ధత ప్రశ్నార్ధకమవుతుందని టీఎంసీ వాదించింది. దీనిపై కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే హైకోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం కలిగించకపోవడంతో దానిని సుప్రీంకోర్టులో టీఎంసీ తాజాగా సవాలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు పీఎస్ నరసింహా, జాయ్‌మాల్య బాగ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఈనెల 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు విచారణ జరుగనుంది.


టీఎంసీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు

ఎన్నికల కౌంటింగ్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పీఎస్‌యూ ఉద్యోగులను మాత్రమే మోహరించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కోల్‌కతా హైకోర్టులో టీఎంసీ సవాలు చేసింది. అయితే టీఎంసీ అభ్యర్థనను హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. సూపర్‌వైజర్లు/అసిసెంట్లుగా కేంద్ర ప్రభుత్వ, పీఎస్‌యూ ఉద్యోగుల నియామకాన్ని సమర్ధిస్తున్నామని పేర్కొంటూ రిట్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈసీఐ డైరెక్షన్‌లో ఇలాంటి నియామకాలు చట్టవిరుద్ధం కాదని కోర్టు అభిప్రాయపడింది. వీరిపై రాజకీయ ప్రభావం ఉంటుందనే భయాలను తోసిపుచ్చింది. అలాంటి భయాలు ఏవైనా ఉంటే ఎలక్షన్ పిటిషన్ (సెక్షన్ 100, ఆర్‌పీ యాక్ట్ 1951) కింద లేవనెత్తాలని కోర్టు అభిప్రాయపడింది.


బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి హర్షం

టీఎంసీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ స్వాగతించారు. తీర్పు ప్రతి తమకు అందిందని, ఎవరిని నియమించాలి, ఎవరిని నియమించకూడదనేది రాజకీయ పార్టీల నిర్ణయానికి లోబడి ఉండదని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ మే 4న జరుగనుంది.


ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 01 , 2026 | 09:03 PM