Share News

బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్.. ఈసీ సంచలన నిర్ణయం

ABN , Publish Date - May 01 , 2026 | 07:06 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులపై భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ బూత్‌లలో మే 2న రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.

బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్.. ఈసీ సంచలన నిర్ణయం
West Bengal repolling

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులపై భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మగ్రహత్ పశ్చిమ్ నియోజకవర్గంలోని 11, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 పోలింగ్ బూత్‌‌లలో మే 2న రీపోలింగ్ జరుపనున్నట్టు ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఈనెల 29న జరిగిన ఎన్నికలకు సంబంధించి 142-మగ్రహత్ పశ్చిమ్ ఏసీ, 143-డైమండ్ హార్బర్ ఏసీ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 58లోని సబ్ సెక్షన్ (2)కింద 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్టు ఈసీ తెలిపింది.


కాగా, రీపోలింగ్‌కు సంబంధించి పోలింగ్ ఏరియాల్లో విస్తృతమైన ప్రచారం జరపాలని, తాజా పోలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఈసీ ఆదేశించింది. ఏప్రిల్ 29న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిసింది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.


ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 01 , 2026 | 07:19 PM