లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమత లేఖ
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:07 PM
లోక్‌సభలో కొత్త చీఫ్ విప్‌గా పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నియమాకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ చైర్మన్, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభ స్పీకర్‌కు అధికారికంగా లేఖ రాశారు.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన 28 మంది లోక్‌సభ సభ్యుల్లో 20 మంది పార్టీ సుప్రీం మమతాబెనర్జీపై తిరుగుబాటు బావుటా ఎగరవేయడం, ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినాయకత్వం తక్షణ చర్యలకు దిగింది. లోక్‌సభలో కొత్త చీఫ్ విప్‌గా పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee)ని నియమించింది. ఈ నియమాకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ చైర్మన్, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభ స్పీకర్‌కు అధికారికంగా లేఖ రాశారు.
పార్టీ నూతన నియామకానికి సంబంధించిన సమాచారాన్ని పార్లమెంటు రికార్డుల్లోకి తీసుకోవాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పీకర్ ఓం బిర్లాను మమతా బెనర్జీ కోరారు. నూతన నియామకం ప్రకారం పార్టీ ఎంపీలను సమన్వయం చేయడంలో కల్యాణ్ బెనర్జీ కీలక పాత్ర పోషించనున్నారు.
మరోవైపు, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని, అందుకు తగినట్టుగా సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్టు టీఎంసీ తిరుగుబాటు వర్గం ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ చెప్పారు. 20 మంది ఎంపీల సంతకాలతో స్పీకర్‌కు లేఖ పంపినట్టు చెప్పారు. లోక్‌సభలో 28 మంది టీఎంసీ ఎంపీలు ఉండగా, 20 మంది ఎంపీలు బయటకు వస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకునే వీలుంది. తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని స్పీకర్ లేఖ ఇస్తే గుర్తింపు పొందే వీలుంది.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ కోసం ఎన్‌డీయే ప్రయత్నాలు!
ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్ ఎంపీల మద్దతు!