Share News

మనీల్యాండరింగ్ కేసు.. పినరయి విజయన్ కూతురికి ఈడీ సమన్లు

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:22 PM

సీఎమ్‌ఆర్ఎల్-ఎక్సాలాజిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కేసుకు సంబంధించి ‘ది ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్’ కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణా విజయన్‌కు సమన్లు జారీ చేసింది.

మనీల్యాండరింగ్ కేసు.. పినరయి విజయన్ కూతురికి ఈడీ సమన్లు
ED summons

తిరువనంతపురం, జూన్ 9: సీఎమ్‌ఆర్ఎల్-ఎక్సాలాజిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కేసుకు సంబంధించి ‘ది ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్’ కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణా విజయన్‌కు సమన్లు జారీ చేసింది. జూన్ 12వ తేదీన (శుక్రవారం) కొచ్చిలోని ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వీణా విజయన్‌తో పాటు 9మందికి ఈడీ సమన్లు జారీ చేసింది.


కేసు వివరాలు..

పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు చెందిన ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్.. ప్రైవేట్ మైనింగ్ కంపెనీ అయిన సీఎమ్‌ఆర్ఎల్‌తో ఓ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం కింద సీఎమ్‌ఆర్ఎల్‌ కంపెనీ.. వీణా విజయన్ కంపెనీకి 1.72 కోట్ల రూపాయల నుంచి 2.78 కోట్ల రూపాయల వరకు చెల్లించింది. అయితే, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్.. సీఎమ్‌ఆర్ఎల్‌ కంపెనీకి ఎలాంటి ఐటీ సేవలు అందించకుండానే ఈ మొత్తాన్ని చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యమంత్రితో ఉన్న కుటుంబ సంబంధాల వల్లే ఈ అక్రమ చెల్లింపులు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.


ఈ నేపథ్యంలోనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వీణా విజయన్‌పై కంపెనీల చట్టం కింద కేసు నమోదు చేసింది. అంతేకాదు.. ఈ నిధుల మళ్లింపుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ చట్టంకింద విచారణ చేపట్టింది. ఈ కేసులో ఈడీ విచారణను రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ సంస్థ కేరళం హైకోర్టును ఆశ్రయించింది. మే 26వ తేదీన విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కోర్టు తీర్పునిచ్చిన మరుసటి రోజే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. తిరువనంతపురంలోని విజయన్ అద్దె ఇంటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఇప్పుడు వీణా విజయన్‌కు నోటీసులు ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం

అఫ్గాన్‌తో వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!

Updated Date - Jun 09 , 2026 | 12:32 PM