Share News

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:07 AM

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మదురై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
Tamil Nadu Bus Accident

తమిళనాడు, జులై 13: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈరోజు(సోమవారం) తెల్లవారుజామున మదురై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుచ్చి వైపు వెళ్తున్న తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ (TNSTC) బస్సును మార్థాండం వైపు వెళ్తున్న ఓమ్ని బస్సు కొత్తంపట్టి సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది గాయపడ్డారు.


సమాచారం అందిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

ఏడు బస్సులు అగ్నికి ఆహుతి

శ్రీకాకుళం రోడ్డు ప్రమాదం.. అప్పలరాజు కుమారుడే బైక్‌ నడిపినట్లు పోలీసుల నిర్ధారణ

Read Latest National News And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 01:07 PM