Share News

96.81లక్షల మందికి ఆల్బెండజోల్‌ మాత్రలు

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:44 AM

పిల్లల్లో నులిపురుగుల (నట్టలు) సమస్యను నివారించేందుకు... రాష్ట్రవ్యాప్తంగా ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయడానికి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

96.81లక్షల మందికి ఆల్బెండజోల్‌ మాత్రలు

  • సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పిల్లల్లో నులిపురుగుల (నట్టలు) సమస్యను నివారించేందుకు... రాష్ట్రవ్యాప్తంగా ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయడానికి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాజ్‌భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సున్న 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు ఈ మాత్రలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకే రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏ కారణంతోనైనా మాత్ర తీసుకోలేకపోయిన వారికి 20వ తేదీన మాప్‌-అప్‌ కార్యక్రమంలో వేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - Jul 13 , 2026 | 05:46 AM