Share News

బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారత్‌కి పునాది: సీఎం విజయ్

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:56 PM

జీఎస్టీ రేట్ల నిర్ణయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రానికి తమిళనాడు సీఎం విజయ్ విజ్ఞప్తి చేశారు. గురువారం మహాబలిపురంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారత్‌కి పునాది: సీఎం విజయ్
TN CM Vijay

చెన్నై, ఆగస్టు 20: ‘బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారతదేశానికి పునాది’ అని తమిళనాడు సీఎం విజయ్ అభివర్ణించారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్ మాట్లాడుతూ పలు కీలక అంశాలు లేవనెత్తారు.


  • సహకార సమాఖ్య విధానమే దేశ బలానికి పునాది అని వ్యాఖ్యానించారు. కేంద్రం - రాష్ట్రాలు, రాష్ట్రాల మధ్య విభేదాలను చర్చలు, పరస్పర గౌరవం, చట్టబద్ధ విధానాల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

  • డీలిమిటేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గకూడదని ఆయన స్పష్టం చేశారు.

  • నీట్ పరీక్షకు వ్యతిరేకత.. తమిళనాడు రాష్ట్ర కోటాలోని MBBS, BDS, ఆయుష్ సీట్లను కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగానే భర్తీ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు.


  • ఆర్థిక పంపకాలలో న్యాయం జరగాలి.. మెరుగ్గా పనిచేస్తున్న రాష్ట్రాలకు నష్టం జరగకుండా, వాటికి మరింత ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • GST రేట్ల నిర్ణయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

  • అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై దృష్టి.. దిగువ ప్రాంత రాష్ట్రాల హక్కులను కాపాడాలని, సుప్రీంకోర్టు తీర్పులు, ట్రిబ్యునల్ అవార్డులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కావేరి, ముల్లై పెరియార్ వివాదాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.


  • డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉమ్మడి పోరాటం అవసరమని పిలుపు. ఆన్‌లైన్‌లో ప్రిస్క్రిప్షన్ మందుల విక్రయాలపై కఠిన నియంత్రణతో పాటు, రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి పెంచాలని సూచించారు.

  • దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక సమైక్యత పెరగాలని ప్రతిపాదన చేశారు. ఉమ్మడి తయారీ కేంద్రాలు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, పారిశ్రామిక - ఫ్రైట్ కారిడార్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

  • బెంగళూరు - హోసూర్ మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. ఇది అంతర్రాష్ట్ర మౌలిక వసతుల సహకారానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.


  • బ్లూ ఎకానమీకి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. పోర్టులు, తీర ప్రాంత షిప్పింగ్, మత్స్య, సముద్ర పరిశ్రమలు, తీర ప్రాంత పర్యాటక రంగాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

  • తీర ప్రాంత మౌలిక వసతులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ, కోస్టల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేసి పెట్టుబడులు, ఉపాధి పెంచాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జెన్‌ జీ పేరుతో బెదిరింపులా? వైరల్‌ వీడియోపై వీకే సింగ్‌ కీలక వ్యాఖ్యలు

'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయం దేశాన్ని అవమానించడమే: అమిత్‌షా

For More National News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 05:20 PM