Share News

'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయం దేశాన్ని అవమానించడమే: అమిత్‌షా

ABN , Publish Date - Aug 20 , 2026 | 01:50 PM

‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. జాతీయ గేయంలోని రెండు చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం దేశాన్ని అవమానించడమేనని విమర్శించారు.

'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయం దేశాన్ని అవమానించడమే: అమిత్‌షా
Amit Shah On Congress Vande Mataram decision

ఇంటర్నెట్ డెస్క్: ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) 1937 నాటి తీర్మానాన్ని అనుసరిస్తూ జాతీయ గేయంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించడం దేశాన్ని అవమానించడమేనని ఆయన విమర్శించారు. ఈ నిర్ణయం జాతి వ్యతిరేకమని ఆరోపించారు.


కాంగ్రెస్‌ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం రాజకీయ నిర్ణయం కాదని, దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని అమిత్‌షా పేర్కొన్నారు. ‘వందేమాతరం’పై కాంగ్రెస్‌ తీసుకున్న వైఖరికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత్‌ విభజనకు కాంగ్రెస్‌ విధానాలే కారణం

కాంగ్రెస్‌ గతంలో అనుసరించిన సంతుష్టీకరణ విధానాల వల్లే దేశం రెండు ముక్కలైందని అమిత్‌షా ఆరోపించారు. గతంలో చేసిన తప్పుల నుంచి కాంగ్రెస్‌ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. ‘వందేమాతరం’ విషయంలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తోందని అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read:

‘ప్రక్షాళన’ వివాదంపై మౌనం.. కాంగ్రెస్ నేతల తీరుపై ఖర్గే అసంతృప్తి!

పాకిస్థాన్‌ హైకమిషన్‌ బారికేడ్లు, ట్రాఫిక్‌ బొల్లార్డ్స్‌ తొలగించిన అధికారులు..

Updated Date - Aug 20 , 2026 | 02:03 PM