కరెన్సీ నోటును అవమానించిన మహిళ అరెస్ట్..
ABN , Publish Date - Oct 05 , 2026 | 01:52 PM
మహాత్మా గాంధీపై అసభ్యకరంగా రీల్ చేసినందుకు ఓ మహిళా కంటెంట్ క్రియేటర్ అరెస్టయ్యారు. ఆ రీల్‌లో ఆమె కరెన్సీ నోటును అసభ్యకరంగా హ్యాండిల్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కటకటాలకు తరలించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: మహాత్మా గాంధీపై అసభ్యకరంగా రీల్ చేసినందుకు ఓ మహిళా కంటెంట్ క్రియేటర్ అరెస్టయ్యారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 47 సిమ్రాన్ పటేల్ రీల్స్ చేసి ఇన్‌స్టా్గ్రాంలో క్రమం తప్పకుండా పోస్టులు పెడుతుంటారు. ఈనెల 1న రూ.500 కరెన్సీ నోటు తీసుకుని ఒక రీల్ చేశారు. ఆ రీల్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు. అయితే, ఆ రీల్‌లో ఆమె కరెన్సీ నోటును అసభ్యకరంగా హ్యాండిల్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కటకటాలకు తరలించారు. ముందుగా ఆమె ఇంటికి వెళ్లి సిమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే, తాను చేసిన పనికి సిమ్రాన్ క్షమాపణలు చెప్పారు. రీల్‌కు ముందు, రీల్ తరువాత అంటూ ఒక వీడియోను సూరత్ పోలీసులు ఎక్స్‌లో విడుదల చేశారు. ఆ వీడియోలో సిమ్రాన్ క్షమాపణ చెబుతున్న దృశ్యాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ ఇమేజ్ ఉన్న ఆ రీల్‌లో అసభ్యకరమైన కంటెంట్, విజువల్స్, సంజ్ఞలు ఉన్నాయని తమకు ఫిర్యాదు అందిందని, అందుకే సిమ్రాన్‌ను అరెస్టు చేశామని చెప్పారు. సామాజిక కార్యకర్త ధర్మేష్ గామి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. సమాజంలోని సామరస్యాన్ని దెబ్బతీసే రీల్స్ పోస్టు చేయవద్దని ఈ సందర్భంగా సూరత్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుపాకీ పట్టిన ఇరాన్ మహిళలు.. హైఅలర్ట్
గుర్తు తెలియని వ్యాధితో లాబ్ వర్కర్ మృతి.. రష్యాలో కలకలం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.