స్నేహితురాలు మాట్లాడట్లేదనే కోపంతో ఆమె తండ్రిని కిడ్నాప్ చేసిన యువకుడు
ABN , Publish Date - Oct 03 , 2026 | 08:53 PM
తుపాకీతో బెదిరించి తన స్నేహితురాలి తండ్రిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. ఇందుకోసం అతడి ఇద్దరు స్నేహితులూ సహాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: స్నేహితురాలు తనతో మాట్లాడట్లేదని ఓ యువకుడు ఆమె తండ్రిని కిడ్నాప్ చేశాడు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లో నివసించే రిషబ్ అనే యువకుడికి అదే నగరంలోని ఓ వ్యాపారవేత్త కుమార్తెతో స్నేహం ఏర్పడింది. ఒక గొడవ కారణంగా కొన్ని రోజులుగా ఆమె రిషబ్‌తో మాట్లాడడం లేదు. దీంతో కోపం పెంచుకున్న అతడు.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె నివాసానికి వెళ్లాడు. అయితే ఆమె ఇంట్లో లేదు. అక్కడే ఉన్న స్నేహితురాలి తండ్రిని చూసి రిషబ్ గొడవ పెట్టుకున్నాడు. అనంతరం ఆ వ్యాపారవేత్తను అతడు కిడ్నాప్ చేశాడు. అలాగే ఆయన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కూడా అపహరించాడు.
ఓ తుపాకీతో బెదిరించి తన స్నేహితురాలి తండ్రిని రిషబ్ కిడ్నాప్ చేశాడు. ఇందుకోసం అతడి ఇద్దరు స్నేహితులూ సహాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా వారిని పట్టుకున్నారు. తరువాత వ్యాపారవేత్తను కాపాడి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అపహరించిన రూ.41.40 లక్షల విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలూ చదవండి
అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. అభిజిత్ దీప్కే క్షమాపణ చెప్పాలన్న రాందాస్ అథవాలే.
డిప్రెషన్‌లో ఉన్నానంటూ 41 ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య.. వీడియో