Share News

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. అభిజిత్ దీప్కే క్షమాపణ చెప్పాలన్న రాందాస్ అథవాలే..

ABN , Publish Date - Oct 03 , 2026 | 08:25 PM

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఆభిజీత్ దీప్కే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) నేత రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు.

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. అభిజిత్ దీప్కే క్షమాపణ చెప్పాలన్న రాందాస్ అథవాలే..
Abhijeet Dipke

ఇంటర్నెట్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఆభిజీత్ దీప్కే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) నేత రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వల్లే అంబేడ్కర్‌కు ప్రాధాన్యం లభించిందని ఇటీవల అభిజిత్ వ్యాఖ్యానించారు (Ramdas Athawale, Abhijeet Dipke).


మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వల్లే అంబేడ్కర్‌కు ప్రాధాన్యం లభించిందనడం చారిత్రక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా చేసిన వ్యాఖ్యలని రాందాస్ విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారని అథవాలే పేర్కొన్నారు. అంబేడ్కర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆపాలని దీప్కేను అథవాలే కోరారు. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీప్కేకు విద్యార్థులు, యువత నుంచి మద్దతు ఉందని, ఆ మద్దతును ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా ఉపయోగించాలని అథవాలే సూచించారు (BR Ambedkar controversy).


ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై కూడా అభిజీత్ దీప్కే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అథవాలే అన్నారు (CJP Abhijeet Dipke comments). మోదీపై, ఫడ్నవీస్‌పై చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌పై దీప్కే విమర్శలు చేశారు.


ఇవి కూడా చదవండి..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ


కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..

Updated Date - Oct 03 , 2026 | 08:58 PM