Share News

ఢిల్లీలో భారీ ఈదురుగాలులు.. మూడు విమానాల ధ్వంసం..

ABN , Publish Date - Jun 08 , 2026 | 01:18 PM

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బలమైన ఈదురుగాలుల ధాటికి స్టెప్స్ లాడర్ విమానాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు ఎయిర్ ఇండియా విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో భారీ ఈదురుగాలులు.. మూడు విమానాల ధ్వంసం..
Air India Aircraft Damage

న్యూఢిల్లీ, జూన్ 08: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో ఆదివారం సాయంత్రం ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. అకస్మాత్తుగా వీచిన బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలోని స్టెప్స్ లాడర్ వేగంగా విమానాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియాకు చెందిన మూడు నారోబాడీ (ఎయిర్‌బస్ ఏ320) విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో విమానాల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.


ఆదివారం సాయంత్రం సుమారు 4:40 గంటల ప్రాంతంలో టెర్మినల్-2 సమీపంలోని విమానాల పార్కింగ్ బేల వద్ద ఈ సంఘటన జరిగింది. అంతవరకూ సాధారణంగా ఉన్న వాతావరణం నిమిషాల వ్యవధిలోనే మారిపోయింది. అకస్మాత్తుగా వీచిన భారీ గాలులు, తుపాను దాటికి ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలకు చెందిన స్టెప్స్ లాడర్ విమనాలపైకి దూసుకెళ్లింది. చూస్తుండగానే పార్క్ చేసి ఉన్న ఎయిర్‌బస్ ఏ320 విమానాలను ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకున్నా.. కానీ..: జిల్ బైడెన్..

భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి

Updated Date - Jun 08 , 2026 | 01:28 PM