Share News

ఈమె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. తుపాకీతో వచ్చిన దొంగను..

ABN , Publish Date - Jun 06 , 2026 | 09:28 PM

ప్రాణాల మీదకు వస్తే సాధారణంగా ఎవరైనా భయంతో వణికిపోతారు, కానీ ధైర్యంగా నిలబడితే ఎంతటి ప్రమాదాన్నైనా తిప్పికొట్టవచ్చని నిరూపించిందో మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఈమె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. తుపాకీతో వచ్చిన దొంగను..
Brave Woman News

ఇంటర్నెట్ డెస్క్: కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు చాలామంది భయంతో చేతులెత్తేస్తారు. కానీ, ధైర్యంగా నిలబడితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చని నిరూపించిందో మహిళ. దుకాణంలో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ.. తుపాకీతో బెదిరించిన దొంగకు ఆమె ఊహించని షాక్ ఇచ్చింది. తుపాకీని చూసినా భయపడకుండా.. సాహసంతో ఆ దొంగపైనే ఎదురుదాడికి దిగింది. చివరకు అతడిని ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేడీ సింగంలా మారిన ఈ మహిళా వ్యాపారి ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ దుకాణంలోని కౌంటర్ వద్ద మహిళ ఒంటరిగా నిలబడి ఉంది. అదే సమయంలో హఠాత్తుగా ఓ దుండగుడు చేతిలో గన్ పట్టుకుని లోపలికి దూసుకొచ్చాడు. ఆమెను తుపాకీతో బెదిరించి, నగదు దోచుకోవడానికి ప్రయత్నించాడు. దుండగుడు గన్ గురిపెట్టడమే ఆలస్యం.. క్షణాల్లో అలర్ట్ అయిన ఆ మహిళ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా నేరుగా దొంగ చేతిలోని తుపాకీని గట్టిగా పట్టుకుంది. దొంగ తన గన్‌ని విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె పట్టు వదల్లేదు. పైగా మరింత తెగువ చూపిస్తూ కౌంటర్‌లోని క్యాష్ బాక్స్‌తో దొంగపై దాడికి దిగింది. దీంతో దొంగకు చెమటలు పట్టాయి. చివరకు ఎలాగోలా ఆమె నుంచి తప్పించుకుని బయటికి పారిపోయాడు. అయినా వదలకుండా సుత్తిని చేతిలోకి తీసుకుని ఆ దొంగ వెంటపడింది. ఈ వీడియోను @WoundedLion__ అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆమె అసలైన లేడీ సింగం’ అని కొందరు, ‘ఇలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలి’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అన్నామలైకి భారీగా మద్దతు.. ఏకంగా 14 లక్షల మంది..

అన్నామలై ఎఫెక్ట్.. రాజీనామాలు చేయవద్దని కోరిన నైనార్ నాగేంద్రన్

Updated Date - Jun 06 , 2026 | 09:49 PM