Share News

అన్నామలైకి భారీగా మద్దతు.. ఏకంగా 14 లక్షల మంది..

ABN , Publish Date - Jun 06 , 2026 | 07:13 PM

‘వియ్ ద పీపుల్’ పేరిట అన్నామలై ప్రారంభించిన రాజకీయ ఉద్యమానికి లక్షల మంది జైకొడుతున్నారు. బీజేపీ నుంచి తప్పుకున్న ఒక్క రోజులోనే కొత్తగా 14 లక్షల మంది వియ్ ది పీపుల్ వెబ్‌సై‌ట్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.

అన్నామలైకి భారీగా మద్దతు.. ఏకంగా 14 లక్షల మంది..
Annamalai

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కొత్త రాజకీయ కార్యాచరణను ప్రకటించిన తమిళనాడు నేత, మాజీ ఐపీఎస్ అన్నామలైకి ప్రజల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. వియ్ ది పీపుల్ పేరిట ఆయన ప్రారంభించిన రాజకీయ ఉద్యమానికి లక్షల మంది జైకొడుతున్నారు. వియ్ ది పీపుల్‌ను ప్రారంభించిన ఒక్క రోజులోనే కొత్తగా 14 లక్షల మంది వాలంటీర్లుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడమే తన లక్ష్యమని అన్నామలై ఇప్పటికే స్పష్టం చేశారు. సామాన్యుల ప్రయోజనాలే కేంద్రంగా రాజకీయాలు ఉండాలని చెప్పారు. అసలైన మార్పునకు దారితీసే రాజకీయాల అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తు తరాలకు గట్టి పునాదులు వేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. వ్యక్తి పూజకు, కుటుంబరాజకీయాలకు తావులేదని చెప్పారు.


తన ఉద్యమానికి వాలంటీర్లే జీవనాడి అని అన్నారు. కొత్త తరం నాయకులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు, క్షేత్రస్థాయిలో అసలైన మార్పు కోసం వాలంటీర్లు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణం.. ఇలా తమకు నచ్చిన రంగాన్ని వాలంటీర్లు ఎంచుకుని చేతనైన మేరకు తాముంటున్న చోట మేలి మార్పులు తీసుకురావాలని కోరారు. రాబోయే రోజులు మరింత మెరుగ్గా ఉండేలా తాను చేస్తున్న ప్రయత్నాలను చేయూతను ఇవ్వాలని పిలుపునిచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

అన్నామలై ఎఫెక్ట్.. రాజీనామాలు చేయవద్దని కోరిన నైనార్ నాగేంద్రన్

వయనాడ్‌లో 150 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన 38 మంది

Updated Date - Jun 06 , 2026 | 07:27 PM