అన్నామలై ఎఫెక్ట్.. రాజీనామాలు చేయవద్దని కోరిన నైనార్ నాగేంద్రన్
ABN , Publish Date - Jun 06 , 2026 | 06:35 PM
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై రాజీనామా అనంతరం పార్టీ రాష్ట్ర శాఖలో రాజీనామాల పర్యం కొనసాగుతోంది. దీనిపై పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తాజాగా స్పందించారు. పార్టీ శ్రేణులు ఎవరూ రాజీనామాలు చేయవద్దని కోరారు.
చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై రాజీనామా అనంతరం పార్టీ రాష్ట్ర శాఖలో రాజీనామాల పర్యం కొనసాగుతోంది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) తాజాగా స్పందించారు. పార్టీ శ్రేణులు ఎవరూ రాజీనామాలు చేయవద్దని కోరారు. ఎవరి రాజీనామాలను ఆమోదించేందుకు తమకు అనుమతి లేదని శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
'బీజేపీకి అన్నామలై శుక్రవారంనాడు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్టీ ఆమోదించింది. అయితే కొందరు సభ్యులు తమ రాజీనామాలకు ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్‌షా ఆశీస్సులు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై నేను చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను. రాజీనామాలు చేయడానికి ఎవరినీ అనుమతించడం లేదు' అని నాగేంద్రన్ తెలిపారు.
పార్టీ క్యాడర్ ఎవరి మాటలు నమ్మవద్దని, రాజీనామాలకు దూరంగా ఉండాలని నాగేంద్రన్ విజ్ఞప్తి చేసారు. ఇతరుల ఉద్యమాల్లో కానీ పార్టీలో కానీ పాలుపంచుకుంటే వారు బీజేపీలో లేనట్టేనని స్పష్టం చేశారు. అన్నామలై రాజీనామాతో పార్టీకి ఎలాంటి ఎదురుదెబ్బ తగల్లేదన్నారు. కాగా, దీనికి ముందు కూడా అన్నామలై రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని నాగేంద్రన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో.. ముగిసిన సీజేపీ నిరసన
రామలింగారెడ్డి రాజీనామా సమస్య పరిష్కారమైంది.. డీకే