Share News

జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరణ.. లాలూ ఇంటి ముందు కార్యకర్తల కాపలా..

ABN , Publish Date - Jun 06 , 2026 | 01:08 PM

బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి కల్పిస్తున్న జడ్ ప్లస్ సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరణ.. లాలూ ఇంటి ముందు కార్యకర్తల కాపలా..
Lalu Yadav security

బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి కల్పిస్తున్న జడ్ ప్లస్ సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. జడ్ ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం బిహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌తో భద్రత కల్పించింది (Lalu Yadav Rabri Devi security).


రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఆర్మ్‌డ్ ఫోర్స్ సిబ్బందిని లాలూ, రబ్రీదేవి శనివారం వెనక్కి పంపించేశారు. లాలూ నివాసం ముందు ఆర్జేడీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని కాపలా కాశారు. లాలూ కుమారుడు, బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడైన తేజస్వి యాదవ్ కూడా తన వై-కేటగిరీ భద్రతను వెనక్కి పంపించారు. కాగా, భద్రతా ఏర్పాట్ల పునఃసమీక్షలో భాగంగా పలువురు విఐపీల సెక్యూరిటీ కేటగిరీల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు (Z Plus security withdrawn).


తమకు, తమ కుటుంబానికి హాని కలిగించాలనే దురుద్దేశంతోనే భద్రతను తొలగించే నిర్ణయం తీసుకున్నారని లాలూ కుమార్తె కుమార్తె రోహిణి ఆచార్య విమర్శించారు (Bihar politics). 'బిహార్ తొలి మహిళా ముఖ్యమంత్రి, ఆమె కుటుంబం ఎలా వేధింపులకు గురవుతున్నారో యావత్ దేశం, బిహార్ ప్రజలు చూస్తున్నారు. కక్షపూరితంగా తీసుకునే ప్రతి చర్యకు బిహార్ ప్రజలు తగిన విధంగా సమాధానం ఇస్తారు' అని రోహిణి ఆచార్య సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.


ఇవి కూడా చదవండి:

పెంచ్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన దృశ్యం.. చిరుత‌ని వెంటాడిన పులి.. వీడియో వైరల్

జాంబీ డ్రగ్స్ ఎఫెక్ట్.. రోడ్డుపై ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో వైరల్

Updated Date - Jun 06 , 2026 | 01:08 PM