Share News

మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకున్నా.. కానీ..: జిల్ బైడెన్..

ABN , Publish Date - Jun 07 , 2026 | 03:16 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ భార్య, మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించిన 7.5 క్యారెట్ల వజ్రాన్ని తాను ఉంచుకోవాలని భావించానని, అయితే అమెరికా నిబంధనల కారణంగా అది సాధ్యపడలేదని వెల్లడించారు.

మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకున్నా.. కానీ..: జిల్ బైడెన్..
Narendra Modi, diamond gift

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ భార్య, మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించిన 7.5 క్యారెట్ల వజ్రాన్ని తాను ఉంచుకోవాలని భావించానని, అయితే అమెరికా నిబంధనల కారణంగా అది సాధ్యపడలేదని వెల్లడించారు. 2023లో భారత్ పర్యటన సందర్భంగా జిల్ బైడెన్‌కు ప్రధాని మోదీ సుమారు 20,000 డాలర్ల (దాదాపు రూ.19 లక్షలు) విలువైన ఆకుపచ్చ రంగు ల్యాబ్-గ్రోన్ వజ్రాన్ని బహుమతిగా అందించారు (PM Modi gift to Jill Biden).


విదేశీ నాయకుల నుంచి బైడెన్ కుటుంబానికి అందిన బహుమతుల్లో అత్యంత ఖరీదైన కానుకగా ఆ వజ్రం నిలిచింది. అమెరికా చట్టాల ప్రకారం.. విదేశీ నాయకుల నుంచి అందే ఖరీదైన బహుమతులను వ్యక్తిగత ఆస్తిగా ఉంచుకోలేరు. వాటిని జాతీయ ఆర్కైవ్స్‌కు లేదా అధికారిక వినియోగానికి బదిలీ చేయాలి. వ్యక్తిగతంగా ఉంచుకోవాలంటే ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువను చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది (US government ethics rules).


'ఆ వజ్రం నాకు ఎంతో నచ్చింది (Jill Biden gift). దానిని కొనుక్కోవాలని మొదట అనుకున్నా. అయితే అధికారికంగా అంచనా వేసిన విలువ నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దానిని కొనుగోలు చేయడం ఆర్థికంగా సాధ్యం కాలేదు. దీంతో చివరకు ఆ వజ్రం అమెరికా ప్రభుత్వ అధీనంలోకి వెళ్లింది' అని జిల్ బైడెన్ తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆస్ట్రేలియా చరిత్రలో మొదటిసారి.. లక్ష బొద్దింకల సీజ్..

పరస్పర దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా

Updated Date - Jun 07 , 2026 | 03:16 PM