డీలిమిటేషన్‌పై స్టాలిన్ ట్వీట్.. స్పందించిన సీఎం రేవంత్
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:27 AM
డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి కేంద్రం వడి వడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణపై మరోసారి రాజకీయంగా వేడి పెరుగుతోంది.
హైదరాబాద్/చెన్నై, ఏప్రిల్ 15: డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి కేంద్రం వడి వడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణపై మరోసారి రాజకీయంగా వేడి పెరుగుతోంది. దక్షిణ రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు, సమాన న్యాయం సాధించేందుకు అందరం ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు ఒకే స్వరంతో మాట్లాడాలి, ఫెడరలిజం ఆత్మను కాపాడాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
సీఎం స్టాలిన్ ట్వీట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం స్టాలిన్ విజన్‌ను సీఎం రేవంత్ ప్రశంసించారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి గత ఏడాది చెన్నైలో సమావేశం ఏర్పాటు చేసిన మొదటి నాయకుల్లో స్టాలిన్ ఒకరని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. మన రాజకీయ హక్కులపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా మనం ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో మన స్వరాని కాపాడుకోవాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ ఇద్దరు సీఎంలు పిలుపునిచ్చారు. ‘Educate, Agitate, Organise’ అనే అంబేద్కర్ సందేశాన్ని గుర్తు చేస్తూ.. కలిసికట్టుగా ముందుకు సాగుదామని వారు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ కేసులో కొత్త మలుపు
వైఎస్ జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్
For More National News And Telugu News