దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:24 PM
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ, జులై 20: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం సోనమ్.. తన దీక్షను విరమించారు. దీంతో గత 23 రోజులుగా ఆయన చేస్తున్న దీక్ష ముగిసినట్లు అయింది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్, విద్యావ్యవస్థలోని లోపాలు నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు.
జూన్ 28వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ఈ దీక్ష ప్రారంభించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఆయన చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన తన దీక్షను కొనసాగించారు. సోనమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాక్రోచ్ పార్టీ జులై 20వ తేదీన చేపట్టిన చలో పార్లమెంట్ యాత్రకు కూడా ఆయన మద్దతు ప్రకటించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
కాక్రోజ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అరెస్ట్.. ఖండించిన పోలీసులు
త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి..
For More National News And Telugu News