టీవీకే అభ్యర్థిపై స్టాలిన్ బాడీషేమింగ్ కామెంట్
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:13 AM
టీవీకే ధర్మపురం బైపోల్ అభ్యర్థి సత్యభామపై తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ బాడీషేమింగ్ కామెంట్లు చేశారు. ఆమెను సోమర్‌సాల్ట్ భామా అని విమర్శించారు. ఉపఎన్నిక జరగనున్న ధర్మపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అధికార టీఎంకేపై పలు ఆరోపణలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీవీకే ధర్మపురం బైపోల్ అభ్యర్థి సత్యభామపై తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ బాడీషేమింగ్ కామెంట్లు చేశారు. ఆమెను సోమర్‌సాల్ట్ భామా అని విమర్శించారు. ఉపఎన్నిక జరగనున్న ధర్మపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అధికార టీఎంకేపై పలు ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీఎంకే కొనుగోలు చేస్తోందని, అంతేకాకుండా అన్నాడీఎంకేను చీల్చేందుకూ కుట్రపన్నుతోందని ఆరోపించారు. అలాగే, టీఎంకే అభ్యర్థి సత్యభామపైనా పలు విమర్శలు చేశారు. కాగా.. సత్యభామ గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ధర్మపురంలో పోటీచేసి గెలిచారు. కొన్ని వారాలకే తన పదవికి రాజీనామా చేసి టీఎంకేలో చేరారు. ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. టీఎంకే తరపున ఆమె ధర్మపురం అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
నీతులు చెప్పి అభ్యర్థులను కొంటున్నారు
అవినీతికి పాల్పడబోమని అధికార టీవీకే పార్టీ నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పారని, ఇప్పుడే వారే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొంటున్నారని స్టాలిన్ విమర్శించారు. అలా అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలలో సత్యభామ కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఆమె సూట్‌కేస్ భామ మాత్రమే కాదని, సోమర్‌సాల్ట్ భామ కూడా అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. స్టాలిన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని టీవీకే లీడర్, ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్ రాజ్ డిమాండ్ చేశారు. మరోవైపు అన్నాడీఎంకే కూడా అధికార పార్టీపై పలు విమర్శలు చేసింది. ప్రతిపక్ష నేతలను అధికార పార్టీ డబ్బులు ఇచ్చి కొంటోందని ఆరోపించింది. అయితే, ఎమ్మెల్యేలను కొన్నట్లు వస్తున్న ఆరోపణలను టీవీకే ఖండించింది. తాము ఎవరినీ కొనలేదని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలే తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
హనుమాన్ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..
చంపేస్తున్న ‘సెకండ్ స్మోకింగ్’
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..