ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి
ABN , Publish Date - Oct 12 , 2026 | 10:03 PM
దేశంలోని ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశంలోని ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. సిక్కిం కొత్త గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్, కేరళం గవర్నర్‌గా ఓం ప్రకాశ్ మాథూర్, తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కర్ణాటక గవర్నర్‌గా డాక్టర్ సుధాయాదవ్, ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డాక్టర్ ధల్ సింగ్ బిసేన్‌లను నియమించారు. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త గవర్నర్ల నియామకాలు వారు తమ పదవి బాధ్యతలు స్వీకరించే తేదీ నుంచి అమల్లోకి వస్తాయని జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్రపతి కార్యాలయం స్పష్టం చేసింది. అయితే కొత్త గవర్నర్ల నియామకాల్లో.. నాలుగు రాష్ట్రాలకు కొత్త వారిని నియమించారు. మరో రెండు రాష్ట్రాలకు మాత్రం గవర్నర్లను బదిలీ చేశారు. ఇక రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గతంలో గోవా అసెంబ్లీ స్పీకర్, హిమాచల్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల గవర్నర్‌గా కూడా పని చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పూంచ్‌లో భారీ పేలుడు.. నలుగురు ఉగ్రవాదులు మృతి!
కేరళలో అతివేగంగా కారు నడిపి ముగ్గురిని బలిగొన్న యువకుడు