Share News

ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురి మృతి

ABN , Publish Date - Aug 31 , 2026 | 07:19 AM

అస్సాంలోని గువాహటి - సోనాపూర్ జాతీయ రహదారిపై నలగేదర వద్ద మినీ బస్సు.. ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురి మృతి
Road Accident In Assam

గువాహటి, ఆగస్టు31: అస్సాంలోని గువాహటి - సోనాపూర్ జాతీయ రహదారిపై నలగేదర వద్ద మినీ బస్సు.. ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే ఖేత్రి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.


ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మినీ బస్సు.. గుంతలో పడడంతో టైరు పగిలింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మినీ బస్సు నాగావ్ నుంచి గువాహటికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రష్యాకు పెట్రోల్‌ సరఫరాదారుగా భారత్‌

‘వన్‌ నేషన్‌.. వన్‌ టైమ్‌..’

For More National News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 07:53 AM