‘వన్ నేషన్.. వన్ టైమ్..’
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:12 AM
దేశవ్యాప్తంగా చట్టపరమైన, పరిపాలన, డిజిటల్, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నింటికీ భారత ప్రామాణిక సమయాన్ని(ఐఎ్‌సటీ) తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం...
‘ఇండియన్ స్టాండర్డ్ టైం’పై కేంద్రం కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశవ్యాప్తంగా చట్టపరమైన, పరిపాలన, డిజిటల్, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నింటికీ భారత ప్రామాణిక సమయాన్ని(ఐఎ్‌సటీ) తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్)’ రూల్స్- 2026 పేరుతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఈ నిబంధనలు అధికారిక గెజిట్‌లో ప్రచురించిన 180 రోజుల తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. ప్రభుత్వ రంగాలు, వ్యాపార సంస్థలు తమ కంప్యూటర్లు, టెక్నాలజీ వ్యవస్థల్లో సమయాన్ని మార్చుకోవడానికి ఈ గడువును కేటాయించారు. ప్రస్తుతం బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, టెలికాం, రైల్వేలు, విమానయానం, పవర్‌గ్రిడ్స్ వేర్వేరు సమయ సూచికలపై నడుస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సమయం కోసం అమెరికాకు చెందిన జీపీఎస్ వంటి విదేశీ వ్యవస్థలపై ఆధారపడుతున్నారు. ఇలా వేర్వేరు సమయాలు నమోదు కావడం వల్ల డేటా రికార్డింగ్‌లో తేడాలు వచ్చి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ‘వన్ నేషన్.. వన్ టైం’ పద్ధతి ద్వారా దేశమంతటా ఒకే సమయాన్ని అమలు చేయడం ద్వారా పేమెంట్లలో సమయ వ్యత్యాసం లేకుండా అత్యంత కచ్చితమైన ‘టైం స్టాంపింగ్’ లభిస్తుందని కేంద్రం తెలిపింది. ఈ కొత్త నిబంధనల ద్వారా.. ఇకపై సమయం కోసం విదేశీ ఉపగ్రహాలపై ఆధారపడటాన్ని తగ్గించి, భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘నావిక్’ శాటిలైట్ నేవిగేషన్ వ్యవస్థ సాయంతో సమయాన్ని అనుసంధానిస్తారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News