Share News

రష్యాకు పెట్రోల్‌ సరఫరాదారుగా భారత్‌

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:15 AM

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా ఇప్పుడు పెట్రోల్‌ కోసం భారత్‌పై ఆధారపడుతోంది. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు

రష్యాకు పెట్రోల్‌ సరఫరాదారుగా భారత్‌

  • ఉక్రెయిన్‌ దాడులతో తలకిందులైన మాస్కో ఇంధన పరిస్థితి!

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా ఇప్పుడు పెట్రోల్‌ కోసం భారత్‌పై ఆధారపడుతోంది. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు చేస్తుండటంతో దేశీయ పెట్రోల్‌ ఉత్పత్తి 70 శాతం వరకు తగ్గిపోయింది. దీంతో మాస్కో విదేశాల నుంచి పెట్రోల్‌ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గుజరాత్‌లోని నయరా ఎనర్జీ (వాడినార్‌ రిఫైనరీ) ద్వారా భారత్‌ కీలక సరఫరాదారుగా అవతరించింది. ఇంధన రంగ విశ్లేషణ సంస్థ ‘వోర్టెక్సా’ ప్రకారం.. జూన్‌, జూలై నెలల్లో భారత్‌ నుంచి రష్యాకు దాదాపు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్‌ సరఫరా అయింది. ఆగస్టులోనూ ఈ సరఫరా కొనసాగినట్లు సమాచారం. రష్యా సముద్ర మార్గం ద్వారా చేసుకునే పెట్రోల్‌ దిగుమతులు ఆగస్టులో రికార్డు స్థాయిలో రోజుకు దాదాపు 1.25 లక్షల బారెళ్లకు చేరాయి. భారత్‌తో పాటు తుర్కియే, మొరాకో కూడా రష్యాకు పెట్రోల్‌ సరఫరా చేస్తున్నాయి. అయితే ఆ రెండు దేశాలతో పొల్చితే భారత్‌ నుంచి సరఫరా భారీగా జరగడం విశేషం.

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో 37 మంది మృతి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కి సమీపంలోని ఒక ఆయుధాల గోడౌన్‌పై శుక్రవారం రాత్రి రష్యా జరిపిన డ్రోన్‌ దాడిలో 37 మంది చనిపోయారు. ఈ ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. కీవ్‌ సమీపంలోని బుచా జిల్లా మైలా గ్రామంలో ఉన్న ఉక్రెయిన్‌ ఆయుధాల గోడౌన్‌పై ఈ దాడి జరిగింది. ఈ గోడౌన్లో షెల్స్‌, మైన్స్‌ తదితర ఆయుధాలను నిల్వ చేశారు.

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 06:15 AM