Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురి మృతి

ABN , Publish Date - Feb 28 , 2026 | 08:44 AM

రాజస్థాన్‌లోని బలోత్రాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురి మృతి
Rajasthan Bus Accident

రాజస్థాన్‌: బలోత్రా(Balotra)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బలోత్రా, బోధ్‌పూర్‌(Bodhpur)లోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ దుర్ఘటన రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా కళ్యాణ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు జోధ్‌పూర్ నుంచి సాంచోర్‌కు బయలుదేరింది. బలోత్రా జిల్లా సర్వాడి గ్రామ సమీపంలో బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి
ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌‌‌తో లావాదేవీలు బంద్.. ట్రంప్ ఆదేశాలు

కొత్త నోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం.

Updated Date - Feb 28 , 2026 | 09:05 AM