బడ్జెట్ కీలక సమావేశానికి డీకే గైర్హాజర్.. సిద్ధరామయ్య ఏమన్నారంటే?
ABN , Publish Date - Feb 10 , 2026 | 09:20 PM
కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటుచేసుకోనుందంటూ వస్తున్న ఊహాగానాలు తగ్గుముఖం పట్టడం లేదు. కర్ణాటక వార్షిక బడ్జెట్ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గైర్హాజరు కావడం, ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో మరోసారి ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగనుందంటూ వస్తున్న ఊహాగానాలు తగ్గుముఖం పట్టడం లేదు. కర్ణాటక వార్షిక బడ్జెట్ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గైర్హాజరు కావడం, ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో మరోసారి ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ ఊహాగానాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం నాడు తోసిపుచ్చారు. అస్సాం ఎన్నికలకు సంబంధించిన ఏఐసీసీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు తనకు డీకే శివకుమార్ లేఖ రాసినట్టు చెప్పారు. దీంతో ఆయన లేకుండానే బడ్జెట్ సమావేశం జరుగుతుందన్నారు. త్వరలో జరుగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా డీకే శివకుమార్‌ను ఏఐసీసీ ఇటీవల నియమించింది.
ఆయననే అడగండి..
కర్ణాటకలో నాయకత్వ అంశంపై మీడియా ప్రశ్నించినప్పుడు, అధిష్ఠానం నిర్ణయమే తుది నిర్ణయమని సిద్ధరామయ్య సమాధానమిచ్చారు. 'పదేపదే ఎందుకు అడుగుతారు? శివకుమార్ ఏదైనా చెప్పి ఉంటే ఆయనే అడగండి' అని ఆయన అన్నారు. అధిష్ఠానం తనను పిలిచినప్పుడు మాత్రమే ఢిల్లీకి వెళ్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పుస్తకం స్టాటస్ ఇదీ.. మౌనం వీడిన మాజీ ఆర్మీ చీఫ్ నరవణే
లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం.. అప్పటి వరకూ సభకు దూరం