పుస్తకం స్టాటస్ ఇదీ.. మౌనం వీడిన మాజీ ఆర్మీ చీఫ్ నరవణే
ABN , Publish Date - Feb 10 , 2026 | 08:33 PM
నరవణే పుస్తకం ఒక్క కాపీ కూడా ప్రచురితం కాలేదంటూ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చెప్పిన విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో నరవణే పోస్ట్ చేశారు
న్యూఢిల్లీ: 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' (Four Stars of Destiny) పుస్తకం దేశ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండటంతో ఆ పుస్తక రచయిత, మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే (MM Naravane) తొలిసారి స్పందించారు. నరవణే పుస్తకం ఒక్క కాపీ కూడా ప్రచురితం కాలేదంటూ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చెప్పిన విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. 'పుస్తకం ప్రస్తుత స్థితి ఇది' అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
దీనిపై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోమవారంనాడు తొలిసారి వివరణ ఇచ్చింది. పుస్తకం పూర్తి హక్కులను తాము కలిగి ఉన్నామని, పుస్తకం ప్రింట్‌లో కానీ, డిజిటల్‌లో కానీ ఇంకా ప్రచురణ కాలేదని తెలిపింది. ప్రసుతం సర్క్యులేషన్‌లో కాపీలు ఏవైనా ఉన్నా, అందులోని కొన్ని భాగాలు వాడుకున్నా, ఏ ఫార్మెట్‌లో ఉన్నా అది కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించింది. అనధికార సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై లీగల్ చర్యలను పరిశీలిస్తామని తెలిపింది.
రెండోసారి వివరణ
పుస్తకంపై వివాదం మరింత తీవ్రమవుతుండటంతో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా మంగళవారం మరోసారి వివరణ ఇచ్చింది. పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని స్పష్టం చేసింది. ప్రీ-ఆర్డర్ కింద అనౌన్స్ చేసిన పుస్తకం, ప్రచురితమైన పుస్తకం ఒకటి కాదని తెలిపింది. పబ్లిషింగ్ విధానాల ప్రకారం ఒక పుస్తకం లాంఛనంగా విడుదలై, రిటైల్ ఫ్లాట్‌ఫాంలపై అమ్మకాలు చేపట్టినప్పుడు మాత్రమే బుక్ రిలీజ్ అయినట్టని చెప్పారు. నరవణే అముద్రిత పుస్తకం సోషల్ మీడియా వేదకలు, అన్‌లైన్ న్యూస్ ఫోరంలపై సర్క్యులేట్ అవుతుండటాన్ని గుర్తించిన ఢిల్లీ పోలీసులు సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ప్రచురణకర్తలు తాజా వివరణలు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం.. అప్పటి వరకూ సభకు దూరం
బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్