Share News

మధురై మీనాక్షి ఆలయం సమీపంలో యువకుడి దారుణ హత్య

ABN , Publish Date - May 25 , 2026 | 10:00 AM

తమిళనాడులోని మధురై నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలో 17 ఏళ్ల యువకుడిని ఆదివారం అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మధురై మీనాక్షి ఆలయం సమీపంలో యువకుడి దారుణ హత్య
Madurai Teenager Case

ఇంటర్నెట్ డెస్క్, మే 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని మధురై నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మీనాక్షి అమ్మన్ ఆలయం (Meenakshi Amman Temple) సమీపంలో 17 ఏళ్ల యువకుడిని నిన్న(ఆదివారం) అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని కుబేంద్రన్‌గా గుర్తించారు. చిత్తిరై ఉత్సవాల సందర్భంగా కుబేంద్రన్‌‌తో.. ముత్తుమణి నేతృత్వంలోని గ్యాంగ్‌కు వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కారణంగానే ఆయనను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన గ్యాంగ్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు మృతుడి సన్నిహితులు ఫిర్యాదు చేశారు. ముత్తుమణి నేతృత్వంలోని గ్యాంగ్ కుబేంద్రన్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.


ఈ కేసులో ముత్తుమణి, రాజ్, సతీశ్‌కుమార్, హరికృష్ణన్, ముత్తుకుమార్‌ల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యతో మీనాక్షి అమ్మన్ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 25 , 2026 | 10:04 AM