Share News

సోనియా, రాహుల్‌తో షర్మిల దంపతుల భేటీ

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:44 AM

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీలతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, భర్త అనిల్‌తో కలసి భేటీ అయ్యారు.

సోనియా, రాహుల్‌తో షర్మిల దంపతుల భేటీ

  • కుమార్తె వివాహ వేడుకకు ఆహ్వానం

న్యూఢిల్లీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీలతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, భర్త అనిల్‌తో కలసి భేటీ అయ్యారు. తమ కుమార్తె అంజిలిరెడ్డి వివాహ వేడుకకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ తన ఆత్మకథ పుస్తకాన్ని షర్మిలకు అందజేశారు. పుస్తకంపై ‘షర్మి’ అంటూ ప్రేమగా సంబోధించి, స్వయంగా ఆటోగ్రాఫ్‌ చేసి ఆమెకు బహూకరించారు. సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని అందుకున్న తొలి వ్యక్తులలో ఒకరిగా ఉండటం ఎంతో గర్వకారణంగా ఉందంటూ షర్మిల ఎక్స్‌ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ భేటీలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సోనియా గాంధీకి, షర్మిల వివరించారు. రాహుల్‌తో సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయాలు, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలపడాల్సిన అవసరం ఉందని, దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ర్టానికి రావాల్సిన విభజన హామీలు నేటికీ నెరవేరలేదంటే దానికి బీజేపీతో పాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలే కారణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చన్నారు. తన కుమార్తె పెళ్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌లను కూడా ఆహ్వానిస్తానని షర్మిల తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 01:46 AM