Share News

ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

ABN , Publish Date - Feb 09 , 2026 | 05:19 PM

నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) అస్వస్థతకు గురయ్యారు. 85 ఏళ్ల పవార్‌ను దగ్గు, శ్వాససంబంధిత సమస్యలతో పుణెలోని రుబీ హాల్ క్లినిక్‌లో సోమవారంనాడు చేర్చారు.

ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
Sharad Pawar

ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) అస్వస్థతకు గురయ్యారు. 85 ఏళ్ల పవార్‌ను దగ్గు, శ్వాససంబంధిత సమస్యలతో పుణెలోని రుబీ హాల్ క్లినిక్‌లో సోమవారంనాడు చేర్చారు. పవార్ కుమార్తె, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే, ఆమె భర్త సదానంద్ సూలే ఆయన వెంట ఉన్నారు.


బారామతిలోని తన నివాసం నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని పుణె ఆసుపత్రికి పవార్‌ను ఈరోజు ఉదయం తీసుకువచ్చారు. వెంటనే వీల్‌చైర్‌లో ఆయను ఆసుపత్రిలోకి తీసుకు వెళ్లారు. వైద్యుల బృందం పవార్‌కు అన్ని వైద్యపరీక్షలు జరిపి తదుపరి చికిత్స అందించనున్నట్టు ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వె గ్రాంట్ తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం పుణెకు పవార్‌ను తరలించినట్టు సుప్రియా సూలే తెలిపారు.


శరద్ పవార్ గతంలో నోటి క్యానర్స్‌కు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ప్రస్తుతం గొంతు ఇన్పెక్షన్, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూయడంతో ఆయన అంత్యక్రియలకు కూడా శరద్ పవార్ హాజరుకాలేదు.


ఇవి కూడా చదవండి..

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ

Updated Date - Feb 09 , 2026 | 07:26 PM