Share News

రాఖీలతో మెరిసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:33 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరీమణులతో కలిసి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన చేతికి కట్టిన రంగు రంగుల రాఖీలను అభిమానులకు చూపిస్తూ మురిసిపోయాడు.

రాఖీలతో మెరిసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
Salman Khan

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ రక్షాబంధన్‌ వేడుకల్లో సందడి చేశాడు. సోదరీమణులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన చేతికి కట్టిన రంగురంగుల రాఖీలను అభిమానులకు చూపిస్తూ మురిసిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ముంబైలో ఉన్న సల్మాన్ సోదరి అల్విరా ఖాన్‌ అగ్నిహోత్రి నివాసంలో రక్షాబంధన్‌ వేడుకలు జరిగాయి. సల్మాన్‌తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలు ముగించుకుని బయటకు వచ్చిన సల్మాన్‌ను ఫొటోగ్రాఫర్లు పలకరించారు. కౌబాయ్‌ తరహా టోపీ, నుదుటిపై తిలకంతో సల్మాన్‌ క్యాజువల్‌ లుక్‌లో కనిపించాడు. ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్లు రాఖీలు చూపించాలని కోరగా.. సల్మాన్‌ తన చేతిని పైకెత్తి రంగురంగుల రాఖీలను చూపించాడు.


హెలెన్‌కు ఆత్మీయ ఆలింగనం

మరో వీడియోలో సీనియర్‌ నటి హెలెన్‌ అల్విరా ఇంటికి రాగానే సల్మాన్‌ ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఈ వేడుకల్లో సోహెల్‌ ఖాన్‌ కుమారుడు నిర్వాన్‌ ఖాన్‌ కూడా కనిపించాడు. ఖాన్‌ కుటుంబం ప్రతి ఏడాది అల్విరా ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


ఇవి కూడా చదవండి:

శ్రీలంకతో టెస్టులో కోహ్లీ ఉంటే ఫలితం మరోలా ఉండేది: మహ్మద్ కైఫ్

పడిక్కల్ టాటూ, పంత్ గాయం.. శ్రీలంక టెస్టు ఫొటోలు పంచుకున్న ప్లేయర్లు!

Updated Date - Aug 28 , 2026 | 06:34 PM