ఆయన మరణం చాలా బాధిస్తుంది.. అజిత్ పవార్ మృతిపై సచిన్ సంతాపం
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:28 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) ఇవాళ(బుధవారం) జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు. ఇక అజిత్ పవార్ మృతిపై సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖలు స్పందిస్తున్నారు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar).. అజిత్ పవార్ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా అజిత్ పవార్‌కు నివాళులర్పించారు.
‘అజిత్ పవార్ గారి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధ పడుతున్నాను. ప్రజల కోసం అంకితభావంతో పని చేసిన ఓ మంచి నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని సచిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు వరుస బహిరంగ సభల కోసం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతికి ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆయన చార్టర్డ్ బాంబార్డియర్ లియర్‌జెట్-45 అనే విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం. బారామతి విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌కు ప్రయత్నించిందని అధికారులు నిర్ధారించారు. రెండవసారి దిగడానికి ప్రయత్నించినప్పుడు, విమానం కూలిపోయింది. ఫలితంగా ఫ్లైట్‌లో ఉన్న అజిత్ పవార్‌తో సహా ఐదుగురు మరణించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి