Share News

తమిళనాడు, బెంగాల్‌లో ముగిసిన తొలిదశ పోలింగ్‌.. ఎంత పోలింగ్ నమోదైందంటే?

ABN , Publish Date - Apr 23 , 2026 | 06:59 PM

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తమిళనాడులో 84.8 శాతం, పశ్చిమ బెంగాల్‌లో తొలిదశలో 91.95 శాతం పోలింగ్ నమోదైంది.

తమిళనాడు, బెంగాల్‌లో ముగిసిన తొలిదశ పోలింగ్‌.. ఎంత పోలింగ్ నమోదైందంటే?
Tamil Nadu And West Bengal Polling

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కీలక రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 6:00 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటువేసే అవకాశం కల్పించారు. ఈ దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం విశేషంగా మారింది. పలువురు ప్రముఖులు సహా ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడులో 84.8 శాతం పోలింగ్ నమోదైంది. అటు.. పశ్చిమ బెంగాల్‌లో 91.95 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా తొలి విడతలో 152 సీట్లకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నేడు పోలింగ్‌ జరిగింది.


ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు, అంటే రెండు రాష్ట్రాల్లోని ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మే 4, 2026 (సోమవారం)న వెల్లడిస్తారు.


ఇవి కూడా చదవండి

ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు భారత్ పర్యాటక వీసాలు..

హైదరాబాద్‌‌లో మరో దగుల్బాజీ దందా.. భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు!

Updated Date - May 03 , 2026 | 03:40 PM