ప్రధాని మోదీపై రవిశాస్త్రి పెట్టిన పోస్ట్ నెవర్ బిఫోర్!
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:18 AM
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ (BRICS) సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాధినేతలు, ఇతర దేశాల ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికర పోస్ట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ (BRICS) సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాధినేతలు, ఇతర దేశాల ముఖ్యనేతలు పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి.. ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో కలిసి రష్యా, చెైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జిన్‌పింగ్ మొక్కలు నాటారు. ఆ ఫోటోను రవిశాస్త్రి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ దౌత్య నీతిని ప్రశంసిస్తూ శాస్త్రి చేసిన ట్వీట్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఉంది.
'ఒక భారతీయుడిగా ఇంతకంటే గర్వకారణమైన క్షణం మరొకటి లేదు. మన మాతృభూమి భారతదేశంలో రష్యా అధ్యక్షులు పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతా కలిసి ఒకే చోట కనిపించారు. ఇలాంటి అంతర్జాతీయ దౌత్యం ఇంతకుముందెన్నడూ చూడలేదు. మోదీ జీ... మీకు చేతులెత్తి మొక్కుతున్నాను' అని రవిశాస్ట్రి రాసుకొచ్చారు. భారతదేశ గ్లోబల్ లీడర్‌షిప్‌ను, ప్రపంచ దేశాల అగ్రనేతలను ఒకే తాటిపైకి తెచ్చిన ప్రధాని మోదీ చొరవను ప్రశంసిస్తూ రవిశాస్త్రి పెట్టిన ఈ 'నెవర్ బిఫోర్' పోస్ట్ క్రీడా, రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది.
ఇవాళ బ్రిక్స్ సదస్సు చివరి రోజున బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వాములు బహిరంగ సమావేశంలో పాల్గొననున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఏడు దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, బురుండి, ఉగాండా, నైజీరియా దేశాల నాయకులతో సమావేశం కానున్నారు. నిన్న(శనివారం) బ్రిక్స్ నాయకులు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఇవి కూడా చదవండి:
బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్
ఇక ఆలస్యం చేయలేం.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ఐరాస మద్దతు..